Paagal Trailer - Vishwak Sen, Nivetha Pethuraj, Simran, Megha Lekha | Aug 14th Release
Description
Vishwak Sen’s #PaagalTrailer. Releasing Worldwide on August 14
Cast: Vishwak Sen, Nivetha Pethuraj, Simran Choudhary, Megha Lekha, Rahul Ramakrishna, Murali sharma, Mahesh Achanta and Indraja Shankar
#PAAGAL
Banner: Sri Venkateswara Creations, Lucky Media
Presents: Dil Raju
Producer: Bekkem Venu Gopal
Story, Screen Play & Direction: Naressh Kuppili
D.O.P: S. Manikandan
Music Director: Radhan
Editor: Garry Bh
Lyrics: Ramajogayya Sastry, KK, Chandra Bose and Anantha Sriram
Fight Masters: Dileep Subbarayan and Rama Krishna
Dance Masters: Vijay Binni
Production Designer: Latha Tharun
Chief Co-Director: Venkat Maddirala
Publicity Designer: Anil Bhanu
Production Manager: Siddam Vijay Kumar
PRO: Vamsi-Shekar, Vamsi Kaka
Additional screen play : chanti karani
Back ground score : Leon James
లవర్‌బాయ్‌గా విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘పాగల్’. నివేదా పేతురాజ్ కథానాయిక. సిమ్రన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘నా పేరు ప్రేమ్. నేను 1600 మంది అమ్మాయిల్ని ప్రేమించాను’ అని విశ్వక్ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ అలరిస్తూనే భావోద్వేగానికి గురిచేస్తోంది. ఎప్పుడూ స్నేహితులతో సరదాగా తిరుగుతూ అమ్మాయిల గురించి ఆలోచించే విశ్వక్‌కి సడెన్‌గా నాయిక నివేదా పరిచయమవుతుంది. అంతే.. తన జీవితం మారిపోతుంది. ‘చూడు.. ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇప్పటి నుంచి ఒకెత్తు. నేను చాలామంది అమ్మాయిలకు ఐ లవ్ యు చెప్పాను. కానీ, నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నా’ అని తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. ‘నువ్వూ నేనూ కలిసుండటం జరగదు. అది మనద్దరికీ మంచిది కాదు’ అని బదులిస్తుంది హీరోయిన్. మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? వాళ్ల ప్రేమ ఎందుకు బ్రేకప్ అయింది? మళ్లీ కలుసుకుంటారా, లేదా? త్వరలోనే తెలియనుంది.
ట్రైలర్‌లో కనిపించిన అందరి నటనా ఆకట్టుకుంటుంది. రాహుల్ రామకృష్ణ, మహేశ్ ఆచంట కడుపుబ్బా నవ్వించారు. గీత ఎక్కడుంటుంది సర్ అని విశ్వక్‌ని ఓ వ్యక్తి అడగ్గా.. గీతకి సంబంధించి పెద్ద జాబితాని బయటపెట్టే సంభాషణ అలరిస్తుంది. నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. రధన్ సంగీతం అందించారు.