One Telugu Trailer | Mammootty | Santhosh Viswanath | Bobby & Sanjay | Premieres July 30
Description
#ONE leader, ONE story of the one and only #Mammootty
Meet the beloved Kalluri Chandram take charge from July 30.
Trailer OUT NOW▶️
Director: Santhosh Viswanath
Writer: Bobby & Sanjay
Producer: Sreelakshmi.R
DOP : Vaidy Somasundaram
Editor: Nishadh Yusuf
Music: Gopi Sundar
#Mammootty
మాలయాళంలోనే కాదు, తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడు మమ్ముటి. ఈ కథకు ఆత్మ ఆయనే. కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యమంత్రి పాత్రలో హుందాగా కనిపించారు. ఆయన నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. మమ్ముటి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దాల్సింది. మురళి గోపీ, జోజు జార్జ్, మాథ్యూ థామస్ ఇలా ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. గోపీ సుందర్ నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. వైద్య సోమసుందర్ సినిమాటోగ్రఫీ ఓకే. వైవిధ్యం చూపించడానికి పెద్దగా ఆస్కారం లేదు. నిషాద్ యూసఫ్ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఒక పాయింట్ చుట్టూ తిరిగే కథకు 152 నిమిషాల నిడివి ఎక్కువ. థియేటర్‌లో చూసే ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. అలాంటిది ఎక్కడికి కావాలంటే అక్కడకు స్కిప్ చేసుకునే వెసులుబాటు ఉన్న ఓటీటీల్లో ఇక పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు సంతోష్ విశ్వనాథ్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, ప్రభావవంతంగా చూపించలేకపోయారు. సగటు ప్రేక్షకుడు ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. కేవలం ఒక పొలిటికల్ డ్రామాగా మాత్రమే కథ, కథనాలు నడుస్తాయి. నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ‘ప్రభుత్వాన్ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం, లా అండ్ ఆర్డర్‌ను ఎలా చెడగొట్టాలా? అని చూడటం నేటి రాజకీయాల్లో ప్రతి పక్షాలు పోషిస్తున్న పాత్ర ఇది. ప్రజల్లో మీపై విశ్వాసం పెరగాలంటే చేయాల్సింది.. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయేలా చేయటం అని మీరు అనుకుంటున్నారు. కానీ, ప్రతిపక్షం వ్యతిరేక పక్షం కాదు.. మరో పక్షం అంతే’ వంటి సంభాషణలు బాగున్నాయి.