Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

Devathalantha Lyrical Video Song | Naandhi | Allari Naresh | Sri Charan Pakala | Vijay Kanakamedala

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
4,332 Views

Description

Watch #Devathalantha​ Lyrical Video Song from #Naandhi​​ New Telugu Movie ft. Allari Naresh. Music by Sri Charan Pakala.

Movie Name - Naandhi (Telugu)

Cast - #AllariNaresh​​, Varalaxmi Sarathkumar, Priyadarshi, Harish Uthaman, Praveen, Navami, Srikanth Aiyyengar, Vinay Varma, Devi Prasad, Pramodhini, Manichandana etc.

‘దేవతలంతా ఉలికిపడేలా దేవుడు కూడా మైమరచేలా ఏమున్నావే పిల్లా’ అంటున్నారు అల్లరి నరేశ్‌. ఈయన కథానాయకుడుగా విజయ్‌ కనక మేడల తెరకెక్కించిన చిత్రం ‘నాంది’. ఈ సినిమాలోని ‘దేవతలంతా’ అనే పాటను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ గీతానికి శ్రీచరణ్‌  పాకాల స్వరాలు సమకూర్చారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ చక్కని గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. 

 ఎస్‌.వి.2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సతీశ్‌ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ప్రియదర్శి, శ్రీకాంత్‌ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ సినిమా. కథానాయకుడిగా నరేశ్‌కి ఇది 57వ సినిమా. ఇప్పటి వరకు నటించిన వైవిధ్య పాత్ర పోషించారు నరేశ్‌. ఖైదీగా ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌లో ఆయన కనిపించిన తీరు సినిమాపై అంచనాలు పెంచుతోంది.



LYRICS:

పల్లవి :

దేవతలంతా ఉలికిపడేలా
దేవుడు కూడా మైమరచేలా
వెన్నెలతోనే దిష్టి తీసేలా
ఉన్నవే పిల్ల, జాబిలి చెల్లా?

చూపుల బాణం వేసి కన్నులతో లాగే
కొంటె పనే చేయకే బాలా
గుండెల లోన కుడి కాలు పెట్టేసావే
నువ్వెవరే మల్లెలమాల

అరె కోవెలలో దీపములే చిన్నబోయేనే
నువ్వే కన్నులతో నవ్విన వేళ
గుడి గంటలుగా నా మనసే మోత మోగెనే
కథే తారు మారు చేసి వెళ్ళకే!

చరణం :

సరాసరి అటు ఇటు చూడాలంటూ కళ్ళు
నీకోసమే వెతుకుతూ ఉసూరంటుంటే
హఠాత్తుగా ఎదురుగ ఇలా వస్తే నువ్వు
హడావిడే పడి మది హుషారయ్యిందే

రానే రాదు కదా నిద్దర నా వైపు
నువ్వే పగటికలై రాతిరొస్తుంటే
పోనే పోవు కదా ఊహలు ఆ లోపు
నిన్నే నా ఎదలో దాచుకుంటుంటే

మళ్ళీ ఏ నిమిషం దూరంగా వెళ్ళిపోనని
నువ్వే సంతకమే పెట్టవే పిల్లా
ఇలా నా ఎదుటే దగ్గరగా ఉండిపొమ్మని
నాపై ఒట్టు పెట్టి బెట్టు చెయ్యనా?


Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS