వ్యవసాయ అనుబంధ రంగాల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ | Story On Block-Chain Technology In Agrisectors
Description
బ్లాక్ చైన్ టెక్నాలజీ...! యావత్ ప్రపంచం ఇప్పుడు ఈ సాంకేతికత వినియోగంపై దృష్టి సారించింది. సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో...ఈ టెక్నాలజీతోనే అడ్డుకట్ట వేయగలమనే భావన నెలకొంది. కార్పొరేట్ సంస్థలతో పాటు... ప్రభుత్వ శాఖలు దీనిని అందిపుచ్చుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఇదే తరుణంలో...వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం మొదలైంది. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఉత్పత్తుల సాగు, నాణ్యతపై భరోసా కల్పించేందుకు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఐటీ రంగంలో విరివిగా ఉపయోగించే ఈ టెక్నాలజీ... రైతులకు లాభం చేకూరేలా... వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు చేర్చేందుకు ఉపయోగపడుతుందంటున్నారు... వ్యవసాయ నిపుణులు.